ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
By Ravi
On
దేశ సరిహద్దుల్లో పరిస్థితులను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మీడియా జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రశంసించారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా వుండే జర్నలిజం కత్తిమీద సాములాంటిది అని, కష్టాలు ఎదురైన లెక్క చేయకుండా డ్యూటీలు చేస్తున్న వారిని ఎంత పొగిడిన తక్కువే అన్నారు. సరిహద్దుల్లో శత్రుసైన్యం చేసిన దాడుల ప్రాంతాల వద్దకు వెళ్లి జనాలకు ఆ ప్రసారాలు, వాస్తవాలు చూపించడం మాములు విషయం కాదన్నారు. అంకిత భావంతో పని చేసే వారిని సజ్జనార్ పొగడ్తలతో ముంచెత్తారు.
Tags:
Latest News
10 May 2025 22:33:32
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్- లాహోర్‌లో పాక్ రాడార్ వ్యవస్థ...