ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్..!
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారని.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారన్న ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేశారన్న న్యాయవాది.. ఎంతో విధేయతతో పనిచేయడం వల్ల అనేక గుర్తింపులు దక్కాయని చెప్పారు. ఆయన ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో శ్రవణ్‌రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్న కోర్టుకు చెప్పారు. ప్రభాకర్‌రావుకు సైతం ముందస్తు బెయిల్ మంజూరుచేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష్య సాధింపుల కోసమే ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదు చేశారన్న ప్రభాకర్‌రావు తరపు న్యాయవాది.. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది అవాస్తవమన్న తెలిపారు. అటు పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూద్రా.. 65 ఏళ్ల వయసుందన్న సాకుతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరన్నారు. ఫోన్‌ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయని.. హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నీళ్లలో పడేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని వాదించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణ 29వ తేదీకి వాయిదా పడింది.