నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
By Ravi
On
నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్ లో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి 4వ అంతస్థులో ఉంటున్నాడు. బెడ్ రూమ్ లో గాఢ నిద్రలో ఉండగా ఏసీలో నుండి మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. దీనితో ఊపిరి ఆడక కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి (38) మరణించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి కొరియోగ్రాఫర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
11 May 2025 20:21:08
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో 86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...