అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్

By Ravi
On
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్

యుద్ధం వస్తే ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన పెంచే కార్యక్రమం..50 ఏళ్ల తర్వాత మన దేశంలో తొలిసారి మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమం ఒళ్లు జలదరించేలా నిర్వహించారు. పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలంతా తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే విషయంలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. 'ఆపరేషన్ అభ్యాస్' పేరిట చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటలకు మొదలయింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ మాక్ డ్రిల్ ను దేశంలో చేపట్టారు. దేశ వ్యాప్తంగా మొత్తం 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్, విశాఖపట్నంలో మాల్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ లో సికింద్రాబాద్, గోల్కొండ, కాంచన్ బాగ్, డీఆర్డీవో, మౌలాలి, షాపూర్ నగర్, మల్లాపూర్ నిర్వహించారు. వీటిని ఆసక్తిగా తిలకించేందుకు జనం ఆయా ప్రాంతాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Tags:

Advertisement

Latest News

కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం రహదారిలో కరాచీ బేకరీ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో...
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ