నకిలీ బిల్లులతో సిఎంఆర్ ఎఫ్ కి టోకరా.. రెండు ఆస్పత్రులు సీజ్

By Ravi
On
నకిలీ బిల్లులతో సిఎంఆర్ ఎఫ్ కి టోకరా.. రెండు ఆస్పత్రులు సీజ్

ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడిన హాస్పిటల్ ను రంగరెడ్డి జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు.  సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద గల హిరణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవకతవకలకు పాల్పడ్డాయని అధికారులు సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేశారు. మిగతా ప్రైవేట్ ఆస్పతుల వివరాలు సైతం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:

Advertisement