పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత

By Ravi
On
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్‌ లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా మరణించారు. 

పాకిస్తాన్‌ లోని బహవల్‌పూర్‌ లో భారతదేశం జరిపిన వైమానిక దాడిలో అజార్ కుటుంబం మట్టుబెట్టబడింది. ఈ దాడిలో మౌలానా మసూద్ అజార్ అక్క, మౌలానా కషాఫ్ కుటుంబం మొత్తం, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ మనవరాళ్ళు మరణించారని, అనేక మంది కుటుంబ సభ్యులు గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడిలో మరణించిన అజార్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం రహదారిలో కరాచీ బేకరీ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో...
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ