గౌలిపురా మేకలమండి స్లాటర్ హౌస్ ని పరిశీలించిన కమిషనర్

By Ravi
On
గౌలిపురా మేకలమండి స్లాటర్ హౌస్ ని పరిశీలించిన కమిషనర్

పాతబస్తీ గౌలిపుర మేకలమండి స్లాటర్ హౌస్ ను జి.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్. వి. కర్ణన్ పరిశీలించారు. అనంతరం ఆర్యకటిక సంఘం నాయకులు. స్థానికుల వ్యాపారులతో చర్చించారు.  స్లాటర్ హౌస్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్రారంభం కాకపోవడానికి గల కారణాలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా స్లాటర్ హౌస్ ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వెంకన్న, గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి .స్థానిక నాయకులతో పాటు వ్యాపారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News