వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు..

By Ravi
On
వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు..

చైనా తాజాగా వైద్య రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో టౌన్ ను ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో పని చేస్తుంది. ఈ టౌన్‌ లో రోగులను ఏఐ డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్లు మనుషులు కాదు. పూర్తిగా రోబోలే డాక్టర్లుగా సేవలు అందిస్తాయి. చైనాలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటైన  యూనివర్సిటీ వైద్య రంగంలో విప్లవాత్మక అడుగు వేసింది. 2025 ట్సింగ్హువా మెడిసిన్ టౌన్‌హాల్ సమావేశంలో ఈ సంస్థ కృత్రిమ మేధస్సు ఆధారిత ఏఐ ఏజెంట్ హాస్పిటల్ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది వైద్య సేవలలో ఏఐ సమగ్ర భాగస్వామిగా మారే దిశగా కీలకంగా మారింది. 

ఈ హాస్పిటల్ లో జనరల్ ప్రాక్టీస్, రేడియాలజికల్ డయాగ్నొస్టిక్స్, శ్వాస సంబంధిత విభాగాలతో పాటు మరికొన్ని ఉండనున్నట్లు తెలిపారు. ఈ హాస్పిటల్ ప్రధాన లక్ష్యం AI ను ఉపయోగించి ఆరోగ్యం, విద్య, పరిశోధన రంగాలను సమగ్రంగా కలిపి ఓ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టం ను నిర్మించడం. ఇది అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, అందుబాటులోకి తీసుకరావడానికి, అలాగే వాటిని ప్రాచుర్యం పొందేలా చేయడం. దీని ద్వారా మెరుగైన వైద్యాన్ని సామాన్యులకు అందించాలన్న దూర దృష్టిని ట్సింగ్హువా పెట్టుకుంది. ఇక ఇది నిజమైన క్లినికల్ అవసరాల ఆధారంగా అభివృద్ధి చేసారు.

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా