ఐపీఎల్ పై హైదరాబాద్ టీమ్ హెడ్ కోచ్
2025 సీజన్ లో భాగంగా తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత రెయిన్ రావడంతో హైదరాబాద్ కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ సీ జన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్ తర్వాత టీమ్ మెయిన్ కోచ్ డానియల్ వెటోరి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మేం ప్రతి మ్యాచ్ దూకుడుగా ఆడాలని అనుకోలేదు. ఈ సంవత్సరం పరిస్థితులు మేం ఊహించిన విధంగా లేవు. గత సంవత్సరం మనం చాలా హైస్కోరింగ్ మ్యాచ్‌లు చూశాం. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది. హైదరాబాద్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. రెండు పిచ్‌లు 250+ స్కోర్లకు వీలుగా ఉంటే.. నాలుగు పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో స్పిన్నర్లకు సపోర్ట్ చేయలేదు. కొత్త బంతిని కొట్టడం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. బంతి బ్యాట్ మీదకు రాలేదు అని వెటోరి ఎక్స్ ప్లైన్ చేశారు.