వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు

By Ravi
On
వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఒక్క సెంచరీతో భారత ప్రధాని మోడీనే అట్రాక్ట్ చేశాడు టీనేజ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ కు తరఫున ఆడుతున్న వైభవ్ ఐపీఎల్ అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్ లో ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టాడు. మూడో మ్యాచ్ లో గుజరాత్ పై 35 బంతుల్లోనే భారీ శతకంతో చెలరేగాడు. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ క్రికెటర్ గా మారాడు. ఏకంగా దేశ ప్రధాని మోడీని ఆకర్షించాడు. తాజాగా ప్రధాని మోడీ వైభవ్ బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ చాలానే సాధించాడన్నారు. వైభవ్‌ ఈ స్థాయికి ఎదగానికి ఎంతో కష్టపడ్డాడని పీఎం కొనియాడారు. అంతకుముందు బీహార్ ముఖ్యమంత్రి వైభవ్ ని కలిసి పది లక్షల చెక్ అందించిన విషయం తెలిసిందే. 

తన రాష్ట్రానికి చెందిన కుర్రాడు సాధించిన ఘనతను తమ రాష్ట్ర సక్సెస్ గా భావించారు సీఎం నితీష్ కుమార్. వైభవ్ భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఫస్ట్ టైమ్ నేషనల్ స్పోర్ట్స్ కు ఆతిథ్యం ఇస్తుంది. మే 4 నుంచి 15 వరకు అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. ప్రధాన నగరాలు పాట్నా, రాజ్‌గిర్, గయ, భగల్‌పూర్, బెగుసరాయ్‌లు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరోవైపు షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ ఢిల్లీ వేదికగా జరగనున్నాయి.

Advertisement

Latest News

పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఇంటిరీయల్‌ పనుల్లో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు. వృత్తితో పాటు ప్రవృత్తిగా గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు చేపడుతూ రూ. రెండున్నర లక్షల బైక్‌, రూ. లక్షన్నర సెల్‌తో...
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్