ఢిల్లీ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ టీమ్ లో మార్పులు?
ఐపీఎల్ 2025 ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. కానీ ఈ టైమ్ లో కూడా క్రికెటర్ల భర్తీ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోకి ఒక ప్లేయర్ ను చేర్చుకుంది. ఈ సీజన్ మిగిలిన మ్యాచుల కోసం విదర్భ ఆల్ రౌండర్ హర్ష్ దుబే లేటెస్ట్ గా సన్‌రైజర్స్ హైదరాబాద్ లో చేరాడు. గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న స్మరాన్ రవిచంద్రన్ ప్లేస్ లో 22 ఏళ్ల దుబేను టీమ్ లోకి తీసుకున్నారు. దూబేను హైదరాబాద్ జట్టు రూ. 30 లక్షలకు తీసుకుంది. హర్ష్ దుబే దేశవాళీ క్రికెట్‌లో విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు అతను 16 టీ20లు, 20 లిస్ట్ ఏ, 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో మొత్తం 127 వికెట్లు పడగొట్టాడు. దీంతోపాటు 941 పరుగులు చేశాడు.
కాగా గత సీజన్‌లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో దుబే 6 మ్యాచ్‌ల్లో 7.50 ఎకానమీ రేటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో స్మరాన్ రవిచంద్రన్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా జంపా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. రంజీ ట్రోఫీలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్ష్ దుబే రీసెంట్ టైమ్ లో రికార్డు క్రియేట్ చేశాడు.