విజయ్‌ సేతుపతి కోసం పూరీ స్పెషల్ సెట్..

By Ravi
On
విజయ్‌ సేతుపతి కోసం పూరీ స్పెషల్ సెట్..

టాలీవుడ్ డాషింగ్ అండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజంట్ విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పూరీకి విజయ్ సేతుపతితో మూవీ అనగానే ఆడియన్స్ లో మంచి హుషారు వచ్చింది. ఈ సినిమాపై అప్పట్నుండి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా పూరీ మూవీలో మీరేందుకు నటిస్తున్నారని విజయ్ ను అడగ్గా.. నాకు కథ నచ్చింది అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పడంతో స్టోరీపై కూడా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే విజయ్ సేతుపతి కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఈ మూవీలో సీనియర్ నటి టబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. 

ప్రజంట్ ఈ సినిమా కోసం పూరీ అండ్ టీమ్ ఓ స్పెషల్ సెట్ ను వేస్తున్నారట. అది కూడా విజయ్ సేతుపతి పై ఓపెనింగ్ సీక్వెన్స్ ను షూట్ చేయడం కోసం అని తెలుస్తుంది. అయితే ఈ షూటింగ్ జూన్ లో జరుగుతుందని టీమ్ తెలిపింది. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. పైగా సినిమాలోని పాత్రలన్నీ చాలా వేరియేషన్స్ తో సాగుతాయట. మొత్తానికి పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. మరి పూరీ, విజయ్ సేతుపతి మూవీ ఎలాంటి హిట్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

Advertisement

Latest News