నన్ను చూసుకునే నాకు పొగరు : బాలయ్య

By Ravi
On
నన్ను చూసుకునే నాకు పొగరు : బాలయ్య

నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్యకు వారి అభిమానులు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నా రెండో పుట్టినిల్లు హిందూపురం. ఇది నందమూరిపురం. ఇక్కడ పౌరసన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి కారకులైన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పద్మభూషణ్‌ మీకు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అన్నారు. కాదు సరైన సమయంలోనే ఇచ్చారని చెప్పానని బాలయ్య అన్నారు. 

బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలవడం, సినిమాల పరంగా నాలుగు వరుస విజయాలు అందుకోవడం, హీరోగా 50 ఏళ్లు పూర్తికావడం.. ఈ సమయంలో పద్మభూషణ్‌ రావడం సంతోషం. 50 ఏళ్లు హీరోగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగుజాతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు అని అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు అని బాలయ్య చెప్పుకొచ్చారు. కాగా ప్రజంట్ బాలయ్య అఖండ 2 తాండవం ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది డైరెక్టర్లతో సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

Advertisement

Latest News

ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..! ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
- అసలు రంగు బయటపెట్టిన ఉండవల్లి- పీఎస్‌ఆర్‌ అరెస్టును తప్పుబట్టిన ఉండవల్లి- సోషల్‌ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్స్‌- జగన్‌పై లోలోపల సాఫ్ట్‌కార్నర్‌- జైల్లో పీఎస్‌ఆర్‌ను పరామర్శించిన ఉండవల్లి-...
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు