తారక్ నుండి ఫ్యాన్స్ అదిరిపోయే డబుల్ ట్రీట్..

By Ravi
On
తారక్ నుండి ఫ్యాన్స్ అదిరిపోయే డబుల్ ట్రీట్..

ఎన్టీఆర్‌ ప్రజంట్ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. పైగా ఈ నెల 20న తన బర్త్ డే స్పెషల్ గా తను యాక్ట్ చేస్తున్న సినిమా గ్లింప్స్ రిలీజ్ అవుతున్నాయని ఫిల్మ్ టీమ్ ఇప్పటికే అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఇప్పుడు వార్ 2 నుండి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా నుండి తారక్ బర్త్ డే స్పెషల్ గా తన ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం మీద మాత్రం ఫిల్మ్ టీమ్ నుండి క్లారిటీ రావాలి. 

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి యాక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కంప్లీట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఆగస్ట్ 14 న పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఇక బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ తారక్ కు ఇంటికి వెళ్లి మరీ విషెస్ చెప్పాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై కూడా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Advertisement

Latest News