బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
By Ravi
On
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు పోయారు. కిరాణ షాప్ వద్దకు బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బెదిరించి మరి వెంట తీసుకు పోయినట్లు స్థానికులు తెలిపారు. ఆజం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఆర్ధిక లావాదేవిలే కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Tags:
Latest News
05 May 2025 06:59:52
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న...