జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు..!
By Ravi
On
మేడ్చల్ TPN: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్‌నగర్ ఎక్స్ రోడ్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. వేసవికాలం మొదలవడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి, అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా స్థానికంగా ఉండే ప్రజలని కూడా ఇందులో భాగస్వాములను చేశామని.. అదేవిధంగా బాలానగర్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావును మరియు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్, జీడిమెట్ల పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Related Posts
Latest News
04 May 2025 19:21:00
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మండలంలో రెవెన్యూ అధికారులకు తాండ యువకులు షాక్ ఇచ్చారు. దుండిగల్ తాండ 2, సర్వే నంబర్: 684లో తెలంగాణ ప్రభుత్వం యువత...