టాప్ ప్లేస్ లో ముంబై ఇండియన్స్..

By Ravi
On
టాప్ ప్లేస్ లో ముంబై ఇండియన్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ముంబై వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ ను 100 పరుగుల తేడాతో ఓడించి, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరుకుంది. దీంతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఇప్పటికే చెన్నై ఈ రేసు నుంచి తప్పుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం ఆటకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశాన్ని మరింత బలోపేతం చేసుకుంది. 

ఈ జట్టు 11 మ్యాచ్‌ల్లో మొత్తంగా ఏడో విజయాన్ని సాధించింది. ఈ జట్టు 4 ఓటములతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు ముంబై సొంతంగా అర్హత సాధించాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలవాలి. ఇకపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే, వారు తమ మిగిలిన మ్యాచ్‌లలో కనీసం 2 విజయాలు సాధించాలి. ప్రస్తుతం ఆర్సీబీ 10 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..