కల్కి జోడీ రిపీట్ కానుందా?

By Ravi
On
కల్కి జోడీ రిపీట్ కానుందా?

దీపికా పదుకొణె.. బాలీవుడ్‌లోనే కాదు, ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె సెప్టెంబర్ నెలలో ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది. ఆమె త్వరలోనే మళ్లీ షూటింగ్‌లలో బిజీ కాబోతోంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమె మరోసారి ప్రభాస్‌ తో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతుందట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్న స్పిరిట్ సినిమాలో నటించమని ఇప్పటికే ఆమెను కోరినట్లు తెలుస్తోంది.  దానికి ఆమె ఒప్పుకుని, రీసెంట్ గా సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె గురించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేయబోతున్నారు. 

ప్రభాస్, దీపికా పదుకొణె కలిసి కల్కి 2898 ఏడి సినిమాలో కనిపించారు. వీరిద్దరూ సినిమాలో కలిసి పనిచేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా పట్టాలెక్కనుంది. అయితే, ఇప్పుడు మరోసారి ప్రభాస్‌ తో స్పిరిట్ సినిమాలో కలిసి నటించబోతోంది దీపికా. స్పిరిట్ సినిమాను టి-సిరీస్‌తో పాటు భద్రకాళి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించబోతోంది. ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించబోతున్నారు.

Advertisement

Latest News

ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు
పాతబస్తీలో ఫుల్ టెన్షన్ నెలకొంది. చాంద్రాయణగుట్టలో తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాబానగర్ సర్వే నెంబర్ 303, 306 కి చెందిన 2000...
జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్
కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్
15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్