ఐపీఎల్‌కు మ్యాక్స్‌వెల్‌ దూరం?

By Ravi
On
ఐపీఎల్‌కు మ్యాక్స్‌వెల్‌ దూరం?

పంజాబ్‌ కింగ్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియన్‌ ఆల్‌ రౌండరైన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. చేతి వేలు విరిగినందున అతడు ఐపీఎల్‌ లో మిగతా మ్యాచ్‌ లు ఆడలేరు. కోల్‌కతా టీమ్ తో జరిగిన మ్యాచ్‌ లో వర్షం పడటానికి ముందే మాక్స్‌ వెల్‌ గాయంతో సఫర్ అయ్యారు. అయితే ఆ మ్యాచ్‌లో అతడు కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. రీసెంట్ గా జరిగిన లేటెస్ట్ మ్యాచ్ లో అతడి స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్ వచ్చాడు. 

కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.  దురదృష్టవశాత్తూ, మాక్స్‌వెల్‌ వేలు విరిగింది. శిక్షణలో చివరి ఆటకు ముందు అతడు గాయపడ్డాడు. ముందు అది చిన్న గాయమే అనుకున్నాం. తర్వాత అది పెద్ద సమస్యే అని తేలింది. స్కానింగ్‌లో వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశముందని నేను భావిస్తున్నాను అని మార్కస్ స్టాయినిస్‌ అన్నాడు. మ్యాక్స్‌వెల్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన సెలెక్షన్ కోసం చూస్తున్నామని పంజాబ్‌ టీమ్ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కామెంట్ చేశారు.

Advertisement

Latest News

ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాగానే జాబ్ క్యాలెండర్ వేగంగా అమలులోకి వస్తుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. రియాజ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని...
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం
ఆ బాలిక స్కూల్ టాపర్ గా నిలిచింది.. కాని విధే ఆమెను వెంటాడింది.
నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్
రాచకొండ కమిషనరేట్ లో సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు