వారికి ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం..

By Ravi
On
వారికి ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం..

పహల్గాం ఉగ్ర దాడితో భారత్‌, పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తానియులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్లు తెలుస్తోంది. పాక్‌ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 30న వాఘా, అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వును తాజాగా సవరించినట్లు తెలుస్తుంది. తదుపరి ఆదేశాలు వెలువడేవరకు వారు ఆ సరిహద్దు నుంచి పాక్‌ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని నేషనల్ మీడియా నివేదికలు తెలిపాయి. 

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌ను వీడి వెళ్లాలని పాక్‌ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాకిస్థాన్‌ వీసాలున్న భారతీయులున్నారు. గత 6 రోజుల్లో వారంతా అటారీ-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు 1,465 మంది వచ్చారు.

Advertisement

Latest News

ఇక అదిరిపోనున్న హైదరాబాద్ ఇక అదిరిపోనున్న హైదరాబాద్
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు