రింకూను కొట్టిన కుల్‌దీప్.. నెటిజన్లు ఫైర్..
ఐపీఎల్ లో తాజాగా కోల్‌కతా, ఢిల్లీ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్.. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ పై చేయి చేసుకున్నాడు. రెండు సార్లు చెంప పై కొట్టాడు. లైవ్ లో ఈ వీడియో రికార్డ్ అవడంతో ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో కుల్‌దీప్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ తర్వాత కుల్ దీప్, రింకూ, ఇతర ఆటగాళ్లు కలిసి మైదానంలో మాట్లాడుకుంటున్నారు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన కుల్‌దీప్ ఉన్నట్టుండి రింకూ చెంపపై ఒక దెబ్బ వేశాడు. ఏం జరిగిందో తెలియక కోల్‌కతా బ్యాటర్ ఒకింత ఆశ్చర్యానికి లోనైనా సరదాగానే తీసుకున్నాడు.
అయితే, ఆ తర్వాత కుల్‌దీప్ మరోసారి కొట్టడంతో రింకూ అసహనానికి లోనైనట్లు కన్పించింది. ఢిిల్లీ స్పిన్నర్ చర్య వెనుక కారణమేంటో స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కుల్‌దీప్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ప్రవర్తన చెత్తగా ఉందని, ఈ సీనియర్ స్పిన్నర్‌పై నిషేధం విధిచాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.