ఘాటీకి, విశ్వంభరకి మధ్య పోటీ?

By Ravi
On
ఘాటీకి, విశ్వంభరకి మధ్య పోటీ?

మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంభర మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో మూవీ రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, విశ్వంభర మరో క్రేజీ మూవీ రిలీజ్‌కు అడ్డంకిగా మారిందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. 

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఘాటీ కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా రిలీజ్‌పై మేకర్స్ మౌనంగా ఉన్నారు. ఈ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నది యువి క్రియేషన్స్ వారు. దీంతో ముందుగా మెగాస్టార్ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వారు ఉన్నారు. విశ్వంభర రిలీజ్ తర్వాత ఘాటీ సినిమాని ప్రమోషన్స్ చేసుకుని రిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఘాటీ సినిమాకి విశ్వంభర మధ్య పోటీ పోతుందా లేదా అనేది చూడాలి.

Advertisement

Latest News

స్పేస్ లో చేపల పెంపకం.. స్పేస్ లో చేపల పెంపకం..
అంతరిక్షంలో వ్యోమగాములకు ఆహార సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు ఫోకస్ చేశారు. మాంసాహార ఉత్పత్తులపై ప్రయోగాలు చేస్తున్నారు. లూనార్‌ హాచ్‌ ప్రాజెక్టులో భాగంగా రీసెర్చర్...
కార్నీ వాల్‌.. కెనడా ప్రధాని డ్యాన్స్‌..
దేశాన్ని వీడిన 786 మంది పాక్‌ పౌరులు..
పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు: మరియం 
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌ గా అలోక్‌ జోషి
సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం 
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు