ఘాటీకి, విశ్వంభరకి మధ్య పోటీ?
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంభర మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో మూవీ రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, విశ్వంభర మరో క్రేజీ మూవీ రిలీజ్‌కు అడ్డంకిగా మారిందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఘాటీ కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా రిలీజ్‌పై మేకర్స్ మౌనంగా ఉన్నారు. ఈ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నది యువి క్రియేషన్స్ వారు. దీంతో ముందుగా మెగాస్టార్ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వారు ఉన్నారు. విశ్వంభర రిలీజ్ తర్వాత ఘాటీ సినిమాని ప్రమోషన్స్ చేసుకుని రిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఘాటీ సినిమాకి విశ్వంభర మధ్య పోటీ పోతుందా లేదా అనేది చూడాలి.