రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్

By Ravi
On
రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్

రాసిపెట్టుకోండి ఇక వచ్చేది మనమే.. ప్రజలకు సంక్షేమం చేస్తుంది మనమే.. కల్లబొల్లి కబుర్లు చెప్పము.. చెప్పింది చేసి చూపిస్తాము.  ప్రత్యేక రాష్ట్రం కోసం పడ్డ కష్టం కాంగ్రెస్ పార్టీ చేతిలో సర్వనాశనం అయ్యింది.  అందుకే చెప్తున్న తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్  ధ్వజమెత్తారు. మొదట జమ్మూకాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషంపాటు మౌనం పాటించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అయితే.. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. మళ్లీ అదే కాంగ్రెస్ నిరంకుశంగా అణిచివేసిందని మండిపడ్డారు. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక,
తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పదాన్ని నిషేధించారు. స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారు అని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. అభివృద్ధి ఆగిపోయిందని కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించినోడు లేడన్నారు. ఎన్నికల్లో అన్ని అబద్ధపు హామీలిచ్చారని మండిపడ్డారు. ఉన్న గాంధీలు.. లేని గాంధీలు తెలంగాణకు వచ్చి చప్పట్లు కొట్టారు.. డ్యాన్సులు చేశారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పదివేలు అంటే.. కాంగ్రెస్ నేతలు 15 వేలు అన్నారు. పెన్షన్లు రూ. 2 వేలు ఇస్తుంటే రూ. 4 వేలు ఇస్తామన్నారు. ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. వికలాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇవన్నీ హామీలు అమలు చేశారా? ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
పేదల పెళ్లి కోసం కేసీఆర్ రూ. లక్ష ఇస్తే.. తాము తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఎక్కడైనా ఇస్తున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి హామీలు ఇస్తున్నారు ఎలా అమలు చేస్తారంటే.. ఇప్పటి ఆర్థిక మంత్రి.. 125 ఏళ్ల పార్టీ తమదని.. తాము హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారని కేసీఆర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ హామీ అమలు కావడం లేదన్నారు. ఉచిత బస్సు పథకాన్ని మహిళలే వద్దంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ అడ్డమైన హామీలను ఇచ్చి మోసం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు నమ్మి జనం బోల్తా పడ్డారని అన్నారు. కేసీఆర్ మాట్లాడితే నిందలు వేస్తున్నారన్నారు. మంచిగా ఉన్న తెలంగాణను బొందలో పడేశారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుండేనని.. ఆదాయం కూడా బాగా వచ్చిందని కేసీఆర్ తెలిపారు. తాము అభివృద్ధి పథంలో నడిపిన తెలంగాణను ఇప్పుడు చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. తన మనసు బాగోలేదన్నారు. తన కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ భూముల ధరలు ఎట్లుండే.. ఇప్పుడేలా ఉన్నాయని ప్రశ్నించారు. అప్పుడు కొనేటోళ్లున్నా.. అమ్మే వాళ్లు తక్కువగా ఉన్నారని.. కానీ, ఇప్పుడు కొనేవాళ్లే లేరని అన్నారు. కేసీఆర్ పక్కకు వెళ్లగానే తెలంగాణ ఇలా అయిపోయిందన్నారు. తాము 24 గంటలు విద్యుత్ అందించామని.. ఇప్పుడెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరెంటు కోతలతో మోటర్లు కాలుతున్నాయని.. పంటలు ఎండుతున్నాయని కేసీఆర్ అన్నారు. ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేదన్నారు కేసీఆర్. రైతులు దోపిడీకి గురవుతున్నారని న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ జాగాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే.. తాము పట్టాలు ఇచ్చామన్నారు. తమ హయాంలో చెరువుల పూడికకు బుల్డోజర్లు ఉపయోగిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేందుకు వాడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో తాము నిలబెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 14వ స్థానానికి పడిపోయిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమివ్వలేదంటారని.. తాము ఇప్పటివరకు మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు ఊరుకునేది లేదన్నారు. ఆవేశంతో కాదు ముళ్లును ముళ్లుతోనే తీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు పార్టీ శ్రేణులు కేకలు వేస్తూ కేరింతలు కొట్టారు

Tags:

Advertisement

Latest News

మెగాస్టార్ సిస్టర్ క్యారెక్టర్ లో సీనియర్ హీరోయిన్ ? మెగాస్టార్ సిస్టర్ క్యారెక్టర్ లో సీనియర్ హీరోయిన్ ?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార యాక్ట్ చేయనున్నట్లు,...
హిమాయత్‌నగర్‌లో లిఫ్ట్‌లో వ్యక్తి దారుణహత్య..!
మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం : చంద్రబాబు
గుడివాడ రైల్వేస్టేషన్‌ను జల్లెడ పట్టిన పోలీసులు..!
కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మహిళా నేతలు ఫైర్‌.. దిష్టిబొమ్మ దహనం..!
పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..!
హిమాయత్ నగర్ లో వ్యక్తి దారుణహత్య.. ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు