వైల్డ్ హార్ట్స్ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!
హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్స్ పబ్‌పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలతోపాటు జనాలను ఆకర్షించడానికి ఉద్దేశించిన అభ్యంతరకరమైన ప్రదర్శనలను బయటపెట్టారు. పోలీసులు కథనం ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువతను ఆకర్షించడానికి పబ్‌లో రెచ్చగొట్టే అభ్యంతరకరమైన డ్యాన్స్ షోలను నిర్వహింస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ ఫుట్‌ఫాల్ మరియు లాభాలను పెంచడానికి మేనేజ్‌మెంట్ ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేసిందని పోలీసులు ఆరోపించారు. ఈ దాడుల్లో ప్రదర్శనలో పాల్గొన్న ముంబైకి చెందిన 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు పబ్ యజమాని, పలువురు కస్టమర్లను కూడా అరెస్ట్ చేశారు. లైసెన్సింగ్ ఉల్లంఘనలతోపాటు మానవ అక్రమ రవాణాతో సహా పబ్ కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.