వీరబల్లి అటవీ ప్రాంతంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు..!
అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలతోపాటు ఒక మోటారు సైకిల్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడి ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. డీఎస్పీ బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో.. ఆర్ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీమ్ స్థానిక ఎఫ్‌బీవో అనిల్ కుమార్‌తో కలసి గురువారం నుంచి అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం క్వారీ పాయింట్ దగ్గర కొంతమంది వ్యక్తులు, ఒక మోటారు సైకిల్‌తో కనిపించారు. వారిని పోలీసులు సమీపించే సరికి వాళ్ల పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. చుట్టుపక్కల వెతకగా సమీపంలో 12 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. వారిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించగా.. వారిని డీఎస్పీలు శ్రీనివాసులు రెడ్డి, షరీఫ్ విచారించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.