మాజీ కార్పొరేటర్‌ భర్త కబ్జాల పర్వం..!

By Ravi
On
మాజీ కార్పొరేటర్‌ భర్త కబ్జాల పర్వం..!

- మహేశ్వరం నియోజకవర్గంలో కబ్జాలపై ఆందోళనకు సిద్దమైన బీజేపీ

- బండంగిపేట 30వ వార్డ్ మాజీ కార్పొరేటర్ భర్తపై ఆరోపణలు
- రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలంటూ జంగారెడ్డిపై బీజేపీ ఆరోపణలు
- కమిషనర్ స్పందించకపోవడంతో ఆదుకోవాలని అమ్మవారికి వినతిపత్రం


కాదేదీ కబ్జా కనర్హం.. అన్న చందంలా తయారైంది మహేశ్వరంలోని కొందరి నేతల తీరు.. అధికారం ఉంది కదా అనుకొని అడ్డదిడ్డంగా భూకబ్జాలకు పాల్పడ్డారు. పదవి కాస్త పోయే సరికి వీరి ఆగడాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా బడంగిపేట 30వ వార్డ్ మాజీ కార్పొరేట్ భర్త జంగారెడ్డిపై కబ్జాల పర్వం అంటూ నియోజకవర్గంలో పెద్ద దుమారం రేగుతోంది. అడిగేవారు లేరని పట్టించుకునే నాధుడులేడని ఆయన ఆగడాలు అంతులేకుండా పోయాయని బీజేపీ పోరాటానికి సిద్దమైంది. 

కార్పొరేటర్ భార్యే అయినా.. పెత్తనం మాత్రం భర్తదే. 5 ఏళ్లలో అడిగేవారు లేక అడ్డదిడ్డంగా భూములు అక్రమించుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంసీఆర్‌ కాలనీలో ఉన్న రోడ్డును కబ్జా చేసి కమర్షియల్ షెడ్డులను నిర్మాణం చేసి అద్దెకిచ్చి ఆదాయాన్ని పొందుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఆయన చేసిన కబ్జాల పర్వంపై బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు. అలాగే నాలాలను కూడా ఆక్రమించుకున్నారని మండిపడుతున్నారు.

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అరాచకాలు అంతాఇంతా కాదని చెబుతున్నారు. సబితకు ముఖ్య అనుచరుడు అవ్వడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. శివసాయినగర్ కాలనీకి సంబంధించిన డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని,  నాలాను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి మాజీ కార్పొరేటర్ భర్త చేతిలో కబ్జాకు గురైన రోడ్డును కాపాడాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ మేయర్ భర్త బినామీ పేర్లతో పట్టాలు పొందిన వ్యవహారంపై గతంలో నియోజకవర్గంలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా జంగారెడ్డి కబ్జాలు అంటూ బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. ఇంత జరుగుతున్నా బడంగిపేట కమిషనర్ మాత్రం మౌనంగా ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!