పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!

By Ravi
On
పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!

ch.శేఖర్‌ tpn, తిరుపతి :

జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరి వారి మండపం దగ్గర నుంచి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వినుత కోటా, జనసైనికులు, వీర మహిళలతో కలిసి మానవ హారం నిర్వహించి సంతాపం తెలిపారు.ఈ సంద్భర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదుల అత్యంత పాశవిక దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పూర్తిగా సహకరిస్తారని, ఇలాంటి చర్యలు జరిగిన రోజు బ్లాక్ డే అని తెలిపారు. మృతుల పట్ల పవన్ కళ్యాణ్ చాలా బాధతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల ఆత్మకి శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేట చంద్రశేఖర్, తోట గణేష్, చిన్నతోటి నాగరాజు, భాగ్యలక్ష్మి, కొట్టిడి మదు శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, నితీష్, రాజ్య లక్ష్మి, జ్యోతీ రామ్, రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఎమ్మార్వో చంద్ర శేఖర్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Latest News

శ్రీకాళహస్తి లో  ఎస్పీఎఫ్  సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు శ్రీకాళహస్తి లో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి కీలక ఆదేశాలు
సి.హెచ్ శేఖర్ TPN :  ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణ వన్ టౌన్ సి.ఐ గోపి ఆధ్వర్యంలో దేవస్థానం...
పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన తెలంగాణ భజరంగ్‌ సేన..!
దోమల నివారణతో మలేరియా వ్యాధికి చెక్‌..!
పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్..!
అఘోరీ గురించి నిజాలు చెప్పిన ప్రత్యక్షసాక్షి..!
బౌరంపేటలో పారిశుద్ధ్య కార్మికుల నిరాహార దీక్షకు బీజేపీ సంఘీభావం..!