పహల్గామ్‌ ఉగ్ర దాడికి నిరసనగా జనసేన మానవహారం..!

By Ravi
On
పహల్గామ్‌ ఉగ్ర దాడికి నిరసనగా జనసేన మానవహారం..!

పహల్గామ్‌ ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దుర్మార్గం అని చెప్పారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు తామంతా అండగా నిలుస్తామని.. జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోందని చెప్పారురు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు సామినేని ఉదయ భాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ, రావి సౌజన్య, మల్లెపు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News