భవిష్యత్తులో కోలుకోలేని పాకిస్తాన్..

By Ravi
On
భవిష్యత్తులో కోలుకోలేని పాకిస్తాన్..

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం దాడి తర్వాత భారత్‌ పాక్‌ కు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో భవిష్యత్ లో పాకిస్తాన్ కోలుకోలేకుండా చేస్తుంది. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసింది. గతంలో పాక్‌తో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా దయతో భారత్‌ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా మాటకు కట్టుబడింది. ఎందుకంటే ఆ నదుల జలాలు పొరుగుదేశానికి జీవనాడులు. కానీ, ఈసారి సహనం నశించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది.  ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధూ జలాల ఒప్పందం ఒకటి. 1960లో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో భారత్‌, పాక్‌ దీనిని కుదుర్చుకొన్నాయి. ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్‌, చీనాబ్‌ నదుల నీరు పాకిస్థాన్‌కు దక్కింది. ఇవి కాకుండా బియాస్‌, సట్లెజ్‌ జలాలు కూడా వెళుతుంటాయి. ఇక భారత్‌ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్‌ కు చేరేలా వాడుకోవాలి. 

ఈ నీటి మీద మాత్రమే పాకిస్తాన్ ఆధారపడి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్‌ దయతో ఈ ఒప్పందం కొనసాగించింది.  ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్థాన్‌ ను ఎండబెడుతుంది. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది. ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాక్‌ వ్యవసాయానికి వాడే నీటిలో 80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే. 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ముఖ్యంగా పాక్‌ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఇది జీవనాడి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇప్పుడు ఈ జలాలు నిలిచిపోవడంతో ఆ దేశం ఖచ్చితంగా అతలాకుతలం అవుతుంది.

Advertisement

Latest News

కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు‌ టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను...
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం