జమ్మూకాశ్మీర్ లో ఉత్కంఠ.. భారీ నిరసనలు..
పహల్గామ్ మారణ హోమం.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో బంద్ కొనసాగుతుంది. ఈ క్రమంలో స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. దుకాణాలు మూసేసి.. నిరసనల్లో పాల్గొంటున్నారు. కాశ్మీరీలు ఐక్యతా నినాదాలతో భారత సైన్యానికి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేను భారతీయుడినే అంటూ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఈ దృశ్యాలు చూస్తున్న వారి కళ్లు సైతం చెమర్చుతున్నాయి. భారత సైన్యానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించాయి. ప్రజలు నిరసనల్లో పాల్గోవాలంటూ మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా పిలుపునిస్తున్నారు.
ఇక జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న పర్యాటకులకు 15 రోజులు ఉచితంగా వసతి ఏర్పాటు చేస్తామని హోటళ్ల యజమాని ఆసిఫ్ బుర్జా తెలిపారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని.. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కోన్నారు. సిగ్గుతో మా తలలు వేలాడుతున్నాయని ఆసిఫ్ బుర్జా అన్నారు. టూరిస్టులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే భారత సైన్యానికి అండగా ఉంటామని ప్రకటించారు.