పాకిస్థాన్‌ హైకమిషన్‌లో సంబరాలు.. 

By Ravi
On
పాకిస్థాన్‌ హైకమిషన్‌లో సంబరాలు.. 

పహల్గామ్ దాడి.. దేశమంతా అట్టుడికిపోయింది. ఈ క్రమంలో భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌లోకి కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీలోని హైకమిషన్ లోనికి కేక్ తీసుకెళ్తున్న వ్యక్తిని చూసిన మీడియా సిబ్బంది.. కేక్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు. కేసు తీసుకెళ్లడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కాగా.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలో పాకిస్థాన్ దుష్ట చర్యల గురించి చర్చించుకుంటున్నారు. కొంతమంది దీనిని పహల్గామ్ దాడికి కూడా లింక్ చేస్తున్నారు. దేశంలో ఇంత బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు.. పాకిస్థాన్ హైకమిషన్‌లో కేకుతో సంబరాలు జరుపుకోవడం పాకిస్థాన్ కుట్రను బహిర్గతం చేస్తుంది. అయితే.. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో కేక్ ఆర్డర్ చేశారని ఒక యూజర్ రాశారు. ఇలాంటి వారితో ఇంకా సోదర భావం ఎందుకు కొనసాగించాలి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్