గౌతమ్‌ గంభీర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు..

By Ravi
On
గౌతమ్‌ గంభీర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు..


టీమిండియా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. నిన్ను హతమారుస్తాం అంటూ ఐసిస్ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఐ కిల్‌ యూ అంటూ తనకు ఈ మెయిల్స్‌ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గంభీర్ కంప్లైంట్ చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం గంభీర్‌ కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐ కిల్‌ యూ అంటూ తనకు రెండు ఈ మెయిల్స్‌ వచ్చినట్లు గౌతమ్ గంభీర్‌ సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను కోరారు. 

గంభీర్ ఫిర్యాదు మేరకు ఈ మెయిల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనే దానిపై సైబర్‌ సెల్ విచారణ చేపట్టింది. ఐసిస్ కశ్మీర్‌ నుంచి ఈ హత్యా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పహల్గాం ఉగ్ర దాడిపై రియాక్ట్ అయినందుకే గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 30 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

Advertisement

Latest News

హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు