కార్తీక్ సుబ్బరాజ్‌తో నాని ప్రాజెక్ట్?

By Ravi
On
కార్తీక్ సుబ్బరాజ్‌తో నాని ప్రాజెక్ట్?

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హిట్ 3 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఇతర భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఇక ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో నాని ఓ ప్రాజెక్ట్ విషయంలో చర్చలు చేస్తున్నారట. కార్తీక్ నానితో ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను షేర్ చేశారని, దానిని ఎలా ముందుకు తీసుకెళ్తే బావుంటుందో అనే టాపిక్ పై నాని ఆలోచిస్తున్నారని అన్నారు. 

ఈ క్రమంలో నాని.. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించే సినిమాలు తనకు చాలా బాగా నచ్చుతాయని తెలిపాడు. కాగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన రెట్రో మూవీ కూడా మే 1న రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా కూడా బాగా ఆడాలని నాని కోరాడు. ఇక త్వరలోనే ఈ కాంబోకి సంబంధించి ఓ అఫీషియల్ అప్డేట్ రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా హిట్ 3 మూవీలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!