ఇకపై వెబ్ సైట్ లో జడ్జిల ఆస్తుల వివరాలు..

By Ravi
On
ఇకపై వెబ్ సైట్ లో జడ్జిల ఆస్తుల వివరాలు..

తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు సిద్ధం అయ్యింది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా, సుప్రీంకోర్టు తన వెబ్‌ సైట్‌ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్‌ లోడ్ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 1న పూర్తిస్థాయి ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను తన వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

ఈ క్రమంలో మరికొందరు న్యాయమూర్తుల నుంచి ఆస్తుల వివరాలు అందిన వెంటనే వెబ్‌సైట్‌ లో అప్ లోడ్ చేస్తామని కోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు నియామకాల పూర్తి ప్రక్రియను, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత యూనియన్ నుంచి వచ్చిన వివరాలు, ఇన్‌పుట్‌లు, సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలనతో సహా, ప్రజల జ్ఞానం, అవగాహన కోసం అత్యున్నత న్యాయస్థానం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. నవంబర్ 9, 2022 నుంచి మే 5, 2025 వరకు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ప్రతిపాదనలు కూడా ఇకపై వెబ్ సైట్ లో ఉంచుతుంది.

Advertisement

Latest News

ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్ ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
సరూర్‌నగర్‌ మన్సూరాబాద్ లో అక్షయ్‌ కుమార్‌(30) తన ఇంట్లో చిన్న సైజ్ వైన్ షాప్ ఓపెన్ చేశాడు. పలు రాష్ట్రాల నుండి నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌...
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా