ఇంటర్ ఫలితాల్లో విశ్రా కళాశాల విద్యార్థుల విజయఢంకా..!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో విశ్రా జూనియర్ కళాశాల విద్యార్థినీవిద్యార్థులు ప్రభంజనం సృష్టించి విజయ ఢంకా మోగించారని కళాశాల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ తెలిపారు. అంతేకాకుండా తమ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆకుల ఐశ్వర్య 466/470, దొర్బల హృషికేశ, ఆకుల శ్రావ్య, ఇందిరా పానీగ్రహీ 464/470, నర్సగళ్ల తన్మయి 462, పిచ్చిక సాయి దీపికా, కంభం జాన్హవి 460/470, బైపీసీ విభాగంలో ఎన్ సాయి తేజస్విని, సామ ముగ్దారెడ్డి 436/440, బీ గాయత్రి 434/440, సీఎచ్ మేథాకృష్ణ 433/440, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వీ శృతి 990/1000, శ్రీ మైనిమ 985/1000, రితికా రెడ్డి, నీతూ కుమారి, చట్టి తేజశ్రీ 983/1000, నాగశైనా 982/1000, అజితేష్ 981/1000, కే శేషాంక్ గుప్తా 980/1000 మార్కులు సాధించినట్లు చెప్పారు. విద్యార్థిని విద్యార్థులు 92 శాతం ఉత్తిర్ణతతో ఏ గ్రేడ్ మార్కులు సాధించటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలలో అభినందించి సన్మానించారు.
అటు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించటం గొప్ప విషయమన్నారు. ఎం సూర్య కిరణ్ 2435, డి విశాల్ 4620, ఎస్ ఆర్ బాలాజీ 5518, ఎన్ శివ 7444, ఆర్ అక్షయ 8570,ఎల్ వర్షిత 9226,కె మోహన్ 10271, వీ శరద్ వల్లభ 13531, బీ వినయ్ కుమార్ 15405, లక్ష్మి నారాయణ 15460, అజితేజ్ 15638, అభిలాష్ 16567, నీతూ కుమారి 20542, నవ్యశ్రీ 34994 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. తమ కళాశాలలో 125 మందిలో 14 ర్యాంకులు రావడానికి కృషిలో భాగమైన ప్రిన్సిపల్, అధ్యాపకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. జాతీయ సగటు 4.06 శాతం కాగా.. విశ్రా కళాశాల సగటు 9.6 శాతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఫలితాలు రావడానికి కారణమైన అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.