మత్తు ఇంజక్షన్లు తీసుకొని యువకుడు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం..!
By Ravi
On
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో.. మెడికల్ డ్రగ్స్ ఇంజక్షన్లు తీసుకొని ఓ మైనర్ మృతి చెందాడు. స్థానిక షాహినగర్‌కు చెందిన అబ్దుల్ నాసర్ మృతి చెందగా.. మరో ఇద్దరు షాబాజ్, హ్యూమానుల్లా పరిస్థితి విషమించడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాహిల్ అనే వ్యక్తి మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్‌ను విక్రయించాడు. ముగ్గురు విద్యార్థులు ఇంజక్షన్‌తోపాటు టాబ్లెట్లను కూడా ఒకేసారి తీసుకున్నారు.
అనుమతులు లేకుండానే మత్తు ఇంజక్షన్లు, టాబ్లెట్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Latest News
02 May 2025 17:03:29
దీపికా పదుకొణె.. బాలీవుడ్లోనే కాదు, ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె సెప్టెంబర్ నెలలో ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది. ఆమె...