జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా 137వ ర్యాంక్ సాధించిన ఎస్ నంద వర్ధన్ నిహాల్, 900వ ర్యాంక్ సాధించిన ఎస్ అఖిల్, 2864వ ర్యాంక్ సాధించిన పీ జగదీశ్వర్‌రావు, JEE అడ్వాన్స్‌డ్ సెలెక్షన్ లిస్ట్‌కు ఎంపికైన ఇతర విద్యార్థులందరిని మంత్రి అభినందించారు. విద్యార్థుల కృషి, గురుకులాల నాణ్యమైన బోధనా విధానం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన వీరు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చగలిగారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని హమీ ఇచ్చారు.