విద్యుత్ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!
By Ravi
On
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెచెరువు దగ్గర విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతిచెందాడు. నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిపై విద్యుత్ తీగలు తెగిపడడంతో.. అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఖేష్‌గా గుర్తించారు. తన స్నేహితులతో ఎల్బీనగర్‌లో అద్దెకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం స్నేహితులతోపాటు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇంతలోనే ఇలా ప్రమాదంలో మృతిచెందాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
20 Apr 2025 21:52:53
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్...