ముంబై టీమ్ మ్యాచ్‌ లో అనంత్, రాధిక.. 

By Ravi
On
ముంబై టీమ్ మ్యాచ్‌ లో అనంత్, రాధిక.. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, చిన్న కోడలు రాధికా మర్చంట్‌ మరోసారి వైరల్ గా మారారు. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ లో వీరిద్దరూ స్టేడియంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముంబై ఇండియన్స్‌ టీమ్ కు నీతా అంబానీ ఓనర్ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అంబానీ ఫ్యామిలీ కచ్చితంగా హాజరవుతూ ఉంటుంది. తాజాగా అనంత్‌, రాధిక జంట ముంబై టీమ్‌ కు మద్దతు తెలిపేందుకు మ్యాచ్‌కు హాజరైంది. ఆ సమయంలో ఈ జంట గ్యాలరీలో పక్కపక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. 

వారిద్దరికి సంబంధించిన క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ మూమెంట్స్‌ను కొందరు తమ కెమెరాల్లో షూట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా, చిన్నతనం నుంచే స్నేహితులైన అనంత్‌, రాధిక గతేడాది జులైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం దాదాపు ఆరు నెలలు జరిగిందనే చెప్పాలి. ప్రీ వెడ్డింగ్‌, పార్టీలు, పూజలు అంటూ ఏడాదంటా వీరి వెడ్డింగ్‌ గురించే ప్రపంచం అంతా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Latest News

అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
అందరికీ అందుబాటులో సులభంగా ఉండే విధంగా భూ భారతి చట్టం తయారు చేయడం జరిగిందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు...
గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య