మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
By Ravi
On
ఏలూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు మే 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవాలు 14వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో మే 11వ తేదీన స్వామివారి కల్యాణం రాత్రి 8 గంటలకు, స్వామివారి రథోత్సవం 12వ తేదీ సాయంత్రం 7.30 గటలకు నిర్వహిస్తామని తెలిపారు. కల్యాణోత్సవాలు జరిగే రోజుల్లో నిత్యార్జిత కల్యాణాలు, అన్న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో వివరించారు. ద్వారకాతిరుమలలో మాత్రమే స్వామివారికి ఏడాదికి రెండు కల్యాణోత్సవాలు జరుగుతాయి. మొదటి బ్రహ్మోత్సవం వైశాఖ మాసంలో నిర్వహిస్తుండగా, రెండో బ్రహ్మోత్సవం అశ్వయుజ మాసంలో జరుగుతుందన్నారు.
Related Posts
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...