మస్క్‌తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. టెక్నికల్ గా, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎలాన్ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించినట్లు తెలిపారు.
కాగా సంబంధిత రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది అంటూ ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేశారు. అంతేకాకుండా భారత్, అమెరికాకు మధ్య వాణిజ్య చర్చల టాపిక్ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ట్రంప్ కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో సైతం మోదీ భేటీ అయ్యారు.