రూ. 200 కోసం తల్లిని కడతేర్చిన కొడుకు..

ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని హతమార్చడం, పిల్లలు తల్లిదండ్రుల్ని కడతేర్చడం నిత్యం ఎక్కడోచోట జరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా తల్లిపాలిట కన్నకొడుకే యముడయ్యాడు. కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్ లో నేడు చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్కను కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
కాగా ఈ సంఘటన ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేశ్వర్ నగర్‌లో జరిగింది. నిందితుడు ప్రదీప్ దేవాంగన్ ఈ రిక్షా డ్రైవర్. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దేవాంగన్ రూ.800 పెట్టి ఓ కుక్కపిల్ల కొనాలనుకున్నాడు. దానికి రూ.200 తక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వాలని తన తల్లి గణేషిని అడిగాడు. బాధితురాలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దేవాంగన్ ఆమెను సుత్తితో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో తనకు అడ్డు వచ్చిన తన భార్య రామేశ్వరిపై కూడా దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Latest News
