సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!

By Ravi
On
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!

హైదరాబాద్ TPN :

మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో సాయిసూర్య డెవలపర్స్ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ప్లాట్‌ల విక్రయాల పేరుతో రూ.100 కోట్లకు పైగా సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థ డిపాజిట్లు సేకరించింది. సోదాల్లో రూ.74.50 లక్షలు ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. సతీష్ చంద్రగుప్త , నరేంద్ర సురానా నివాసాలపై సోదాలు జరిపిన ఈడీ.. ప్లాట్‌ల విక్రయాల పేరుతో ముందుగానే చెల్లింపులు రాబట్టిన సాయి సూర్య డెవలపర్స్.. ఒకే ప్లాట్‌ను వివిధ వ్యక్తులకు అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది. ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండానే భూముల విక్రయాలు జరిపినట్లు వెల్లడైంది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!