బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
By Ravi
On
హైదరాబాద్ TPN :
అత్తాపూర్‌లోని రెడ్డి బస్తీలో విషాదం అలుముకుంది. మాసబ్‌ట్యాంక్ జేఎన్‌టీయూలో ఎమ్‌టెక్ చదువుతున్న పవన్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్ యాప్స్‌లో ఒకే సారి లక్ష రూపాయలు పోవడంతో.. మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు. తన దగ్గరున్న ఐఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను అమ్ముకోవడమే కాకుండా.. తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్ యాప్‌లోనే పెట్టాడు. ఒక్క రూపాయి కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవన్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...