ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
By Ravi
On
హైదరాబాద్ TPN:
జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలాజీ లే అవుట్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న తేజ అనే 30 ఏళ్ల మహిళ.. తన ఇద్దరు కుమారులను కొబ్బరిబోండాల కత్తితో నరకగా.. 11 ఏళ్ల హర్షిత్ అక్కడికక్కడే చనిపోయాడు. 8 ఏళ్ల ఆశిష్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు కుమారులపై కత్తితో దాడిచేసిన తేజ.. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు తేజ మానసిక పరిస్థితి కూడా బాగోలేకపోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Related Posts
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...