ఏపీ లిక్కర్‌స్కామ్ కేసులో సిట్ దూకుడు..!
By Ravi
On
హైదరాబాద్ TPN:
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా హైదరాబాద్‌లో సిట్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్‌స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ కంపెనీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కసిరెడ్డి పలు కంపెనీలు స్థాపించారు. ఇకపోతే.. సిట్ అధికారులు నాలుగోసారి కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
Related Posts
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...