రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు..! 

By Ravi
On
రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు..! 

రంగారెడ్డి TPN : బాలాపూర్ మండలం మామిడిపల్లిలో రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. తమ దగ్గర నుంచి బలవంతంగా భూముల్ని లాక్కొని రేవంత్‌ సర్కార్‌ వాటికి ఫెన్సింగ్‌ వేసిందని ఆరోపించారు. రేపోమాపో ఈ భూములనూ అమ్మేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడిపల్లిలోని సర్వే నంబర్ 99/1లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. తాతముత్తాతల నుంచి ఆ భూముల్లోనే సాగు చేసుకొని జీవించినట్లు చెప్పారు. 186 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారని.. ఏ రైతుకు ఎంత భూమి ఉందో రెవెన్యూ అధికారులకు తెలుసన్నారు. ఎయిర్‌పోర్ట్ కోసమని భూమి తీసుకున్న ప్రభుత్వం.. రైతులకు పైసా పరిహారం ఇవ్వకపోగా.. ఆ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకుంటోదని ఆరోపించారు. తమకు న్యాయం చేసేంత వరకు భూములను ఇవ్వబోమని తెలిపారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా.. ప్రతి రైతుకు న్యాయం చేసి నిరూపించుకోవాలని కోరారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!