జగన్ ఆస్తుల కేసులో కదలిక..!
జగన్ ఆస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఈడి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన రూ.793 కోట్ల ఆస్తుతోపాటు దాల్మియా భారత్ ఆస్తులు జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో రూ.377 కోట్ల విలువైన భూమి భారతి సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ చెబుతోంది. కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులు కట్టబెట్టినందుకు భారతి సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్ పెట్టుబడి పెట్టినట్లు ఆరోపిస్తోంది. 2011లో సీబీఐ కేసు నమోదు చేయగా.. 2013లో చార్జిషీటు దాఖలైంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడి దర్యాప్తు చేస్తోంది. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టినవారి గురించి ఆరా తీస్తోంది. సున్నపు రాయి గనుల లీజులో ఆయాచితి లబ్ది పొందిన వారి ఆస్తులు జప్తు చేస్తోంది. పునీత్ దాల్మియాకు, విజయసాయి రెడ్డికి మధ్య డీల్ కుదిరిందని సీబీఐ చెబుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన పాసిఫామ్‌కు వాటలో కొంత భాగాన్ని అమ్మిన దాల్మియా.. వచ్చిన సొమ్ములో రూ.55కోట్లు జగన్‌కు బదిలీ చేశారన్న సీబీఐ ఆరోపిస్తోంది. 2010 నుంచి 2011 మధ్య హవాలా లావాదేవీలు జరిగాయని వెల్లడించింది. వీటన్నింటితోపాటు ఐటి సోదాల్లో లభ్యమైన డీల్‌కు సంబంధించిన వివరాలు, ఆధారాలతో రూ.793 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.