జగన్ అరెస్టుకు వేళాయెరా..!
- లిక్కర్‌స్కామ్‌లో జగన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
- జగన్ అరెస్ట్‌కు ఎన్డీఏ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్
- జగన్ అరెస్ట్‌కు సాధనంగా విజయసాయిరెడ్డి
- లిక్కర్‌స్కామ్‌లో కసిరెడ్డి పాత్రను బయటపెట్టిన విజయసాయి
- యూఎస్ కంపెనీ ద్వారా మద్యం కుభకోణం డబ్బు మళ్లింపు
- కాలిఫోర్నియాలో మోరిస్ & విల్నర్ పార్టనర్స్ కంపెనీ
- త్వరలోనే కసిరెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం
- అప్రూవర్‌గా మారనున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
- కసిరెడ్డి వాంగ్మూలంతో జగన్‌కు నోటీసులు ఇచ్చే ఛాన్స్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ అరెస్ట్ తప్పదనే వార్తలు వినిపించాయి. ఐతే.. కూటమి పెద్దలు మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. అన్నివైపుల నుంచి జగన్‌ను బిగించడానికి తెరవెనుక పెద్ద వ్యవహారమే నడుస్తోంది. దీంట్లో భాగంగానే విజయసాయిరెడ్డిని పావుగా వాడుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఒక్కసారి ఓపెన్ అయిపోతే.. జగన్ అరెస్టుకు ముహూర్తం కుదరినట్లే. ఇప్పటికే లిక్కర్‌స్కామ్‌లో జగన్ పాత్రపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జగన్‌కు నోటీసులు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్రను ముందుగా విజయసాయిరెడ్డే బయటపెట్టారు. ఇప్పుడు జగన్‌ను అరెస్ట్ చేయడానికి అవసరమైన అన్ని విషయాలను ఆయన వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇకపోతే.. విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో జగన్ కోసం విజయసాయిరెడ్డి హస్తినలో అనేక పైరవీలు చేశారు. ఇప్పుడా పరిచయాలతోనే తన రక్షణ కోసం పావులుగా వాడుకుంటున్నారు. అటు బీజేపీ పెద్దల అనుమతి లేకుండా ఏపీ సర్కార్ కూడా విజయసాయిని తాకలేదు. ఇక ఆయన కుమార్తె బీజేపీలో చేరుతున్నట్లు గతంలోనే పాయింట్ న్యూస్ వెల్లడించింది. మరోవైపు జగన్ని అరెస్ట్ చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ మేరకు అవసరమైన అన్ని రకాల పేపర్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
గతంలో జగన్‌కు విజయసాయిరెడ్డి భరోసాగా ఉండేవారు. చట్టపరమైన, వ్యూహాత్మక విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇప్పుడు జగన్ అరెస్ట్‌కు ఆయనే ఓ సాధనంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. ఈసారి విజయసాయి జగన్‌తో లేకపోవడంతో.. ఈ చట్టపరమైన సమస్యలన్నింటినీ ఎదుర్కోవడంలో ఆయన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పెద్ద పెద్ద లాయర్లు ఉన్నా కూడా.. హస్తినలో లాబీయింగ్ చేయడానికి విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు మాత్రం ఇప్పుడు జగన్ దగ్గర లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నా కూడా.. వారెవరికీ విజయసాయిలా ఎన్డీఏ నాయకత్వంతో సాన్నిహిత్యం లేదు. జగన్ తరపున ఆయన ఎన్డీఏతో మంచి సంబంధాలు కొనసాగించారు. అందుకే విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దల దగ్గర ప్రాధాన్యత ఎక్కువ. గతంలో వైసీపీలో విజయసాయిరెడ్డి నంబర్2 పొజిషన్‌లో ఉండేవారు. దీంతో విశాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారని.. ఆ డబ్బు తాడేపల్లి ప్యాలెస్‌కు రాలేదని ప్రచారం చేశారు. దీంతో ఆయనకు జగన్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. ఇక జగన్ సతీమణి భారతి ద్వారా విజయసాయి ప్లేస్‌ను సజ్జల ఆక్రమించుకున్నారు. క్రమంగా జగన్‌కు సజ్జల నీడగా మారారు.
ఇకపోతే.. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారవచ్చని టాక్ వినిపిస్తోంది. జగన్‌ని అరెస్టు చేయడానికి సిట్‌కు సహాయం కూడా చేయవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కేసు నుంచి బయటపడటానికి కసిరెడ్డి ఒక రాజకీయ నాయకుడితో ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలో పాయింట్ వెల్లడించింది. ఇకపోతే.. కసిరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియక నోటీసులు ఇవ్వకపోవడం అంతా ఒక హైడ్రామా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం చెప్పాలో కూడా కసిరెడ్డికి టిప్ అందిందని సమాచారం. కసిరెడ్డి హైదరాబాద్‌లోని ఒక భూమిలో పెట్టుబడి పెట్టి.. అందులో కొంత భాగాన్ని ప్రముఖులకు అమ్మేశారు. జగన్‌ను, ఆయనను నమ్మిన ప్రముఖులను కూడా మోసం చేశారు. దీంతో ఆయన పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజగా ఆయనకు అమెరికాలో ఒక కంపెనీ ఉందని, అందులో ఆయన భార్య డైరెక్టర్‌గా ఉందనే వివరాలు బయటికొచ్చాయి. ఈ కంపెనీ పేరు మోరిస్ & విల్నర్ పార్ట్‌నర్స్, ఐఎన్‌సీ, కాలిఫోర్నియా చిరునామాలో రిజిస్టర్ అయింది. రాజశేఖర్‌రెడ్డి భార్య దివ్య దీనికి డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే ఆరేటి హాస్పిటల్స్‌కు కూడా ఆమె డైరెక్టర్. వైసీపీ హయాంలో డిస్టిలరీల నుంచి నిధులు ఈ కంపెనీల ద్వారానే వెళ్లాయని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే వారు కసిరెడ్డి ఇంటితో సహా ఆరేటి హాస్పిటల్స్‌లో సోదాలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కసిరెడ్డిని అతి త్వరలో అరెస్టు చేస్తారట. ఆ తర్వాత ఆయన అప్రూవర్‌గా మారతారని.. ఆ తరువాత జగన్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విజయసాయి, కసిరెడ్డి ఇచ్చిన వివరాలతో.. జగన్‌పై కేసు నమోదు చేసి ఆ వెంటనే అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.